సెలబ్రిటీల్లో ఆ 'పిచ్చి' ముదిరితే ప్రమాదం! | that madness in Celebrities is danger signal | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీల్లో ఆ 'పిచ్చి' ముదిరితే ప్రమాదం!

May 12 2016 7:50 PM | Updated on Oct 16 2018 8:38 PM

సెలబ్రిటీల్లో ఆ 'పిచ్చి' ముదిరితే ప్రమాదం! - Sakshi

సెలబ్రిటీల్లో ఆ 'పిచ్చి' ముదిరితే ప్రమాదం!

అమెరికా, బ్రిటన్‌ సెలబ్రిటీల్లో కొత్త ట్రెండ్‌ మొదలైంది.

లండన్‌: అమెరికా, బ్రిటన్‌ సెలబ్రిటీల్లో కొత్త ట్రెండ్‌ మొదలైంది. నగ్నంగా సెల్ఫీలు తీసుకోవడం వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అమెరికా రియాలిటీ టీవీ పర్సనాలిటీ కిమ్‌ కర్దాషియన్‌తో ఈ ట్రెండ్‌ మొదలైందని చెప్పవచ్చు. ఆ తర్వాత అమెరికా మోడల్, హాలివుడ్‌ సినీ తార ఎమిలీ రటాజ్‌కోస్కీ, మరో సినీ తార మార్నీ సింప్సన్, మోడల్, టీవీ పర్సనాలిటీ, కాలమిస్ట్, రైటర్‌ విక్కీ పట్టిసన్‌లు వరుసగా నగ్నంగా సెల్ఫీలు తీసుకొని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. వీరికన్నా తానేమి తక్కువ తినలేదంటూ అమెరికా సింగర్, సినీ తార మిలీ సైరస్‌ ముప్పావు నగ్నంగా ఎంటీవీ అవార్డుల కార్యక్రమానికే హాజరై సంచలనం సష్టించారు.

నిజానికి ఇది కొత్త ట్రెండ్‌గానీ, ఫ్యాషన్‌గానీ కాదని, ఇదోరకమైన ఫోబియా అని, దీన్ని జనిటల్‌ ఫోబియా అని పిలువచ్చని లండన్‌లోని క్వీన్స్‌ గైనకాలజి క్లినిక్‌లో పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అహ్మద్‌ ఇస్మాయిల్‌ తెలిపారు. ఈ పిచ్చి ముదిరితే ప్రమాదకరమని, ఈ ఫోబియాను ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిదని ఆయన సెలబ్రిటీలను హెచ్చరించారు.

తోటివారి సెక్స్‌ గురించి, వారి ఎఫైర్ల గురించి బహిరంగంగా చర్చించే అవకాశం ఉన్న అమెరికా, బ్రిటన్‌ సెలబ్రిటీల్లోనే ఈ ఫోబియా ఎక్కువగా కనిపిస్తోందని ఇస్మాయిల్‌ చెప్పారు. పొత్తి కడుపు కింది భాగం ఆకర్షణీయంగా లేదనే పొరపాటు అభిప్రాయం కారణంగా ఈ ఫోబియా పుట్టుకొస్తుందని ఆయన అన్నారు. ఆ భాగం ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల బాయ్‌ ఫ్రెండ్‌ను మెప్పించలేనని, అభిమానులను ఆకట్టుకోలేక పోతానేమోననే భయంతో వారు నగ్నంగ్‌ సెల్ఫీలు తీసి ఆన్‌లైన్‌ పోస్ట్‌ చేస్తున్నారని, తద్వారా వచ్చే హిట్స్‌ చూసి అమ్మయ్య! ఫర్వాలేదనుకొని ఆత్మ సంతప్తి పొందుతున్నారని ఆయన చెప్పారు.

ఈ ట్రెండ్‌ను ఇలాగే కొనసాగిస్తూ పోతుంటే ఇందులోనూ పోటీ పెరిగి విపరీత పరిణామాలకు దారితీస్తుందని డాక్టర్‌ ఇస్మాయిల్‌ హెచ్చరించారు. ముఖం బాగోలేదనుకొని ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకున్నట్లుగా మున్ముందు జనిటల్‌ సర్జరీలకు ఈ ట్రెండ్‌ దారితీస్తుందని ఆయన అన్నారు. పాప పుట్టిన తర్వాత కిమ్‌ కర్దాషియన్‌ నగ్న సెల్ఫీని పోస్ట్‌ చేయడం వెనక, తల్లైన తర్వాత కూడా తన శరీరాకృతి బాగా ఉందని అభిమానుల మన్ననలను పొందేందుకే ఆమె అలా చేశారని ఆయన భాష్యం చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement