కాశ్మీరులో గులాబీ తోట! | Telugu Rose Garden movie Shooting in Kashmir | Sakshi
Sakshi News home page

కాశ్మీరులో గులాబీ తోట!

Oct 28 2016 11:02 PM | Updated on Oct 2 2018 3:27 PM

కాశ్మీరులో గులాబీ తోట! - Sakshi

కాశ్మీరులో గులాబీ తోట!

నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా జి.రవికుమార్ (బాంబే రవి) దర్శకత్వంలో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో

నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా జి.రవికుమార్ (బాంబే రవి) దర్శకత్వంలో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘రోజ్‌గార్డెన్’. ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో కాశ్మీర్‌లో చిత్రీకరణ చేయడం సాహసమే.

కాశ్మీర్ ప్రభుత్వ సహకారంతో భారీ భద్రత మధ్య ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ చేస్తున్నాం’’ అన్నారు. చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ - ‘‘ఓ ప్రేమ జంట తీవ్రవాదుల కారణంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొందనే అంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఎనభై శాతం చిత్రాన్ని కాశ్మీర్‌లోనే చిత్రీకరిస్తాం. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మిగతా చిత్రీకరణ పూర్తి చేస్తాం. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement