మానవీయ విలువలతో... | telugu new Neelimalai Movie | Sakshi
Sakshi News home page

మానవీయ విలువలతో...

Dec 27 2016 12:24 AM | Updated on Sep 4 2017 11:39 PM

మానవీయ విలువలతో...

మానవీయ విలువలతో...

ఆనంద్‌కృష్ణ, వృశాలి జంటగా లవ్, యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘నీలిమలై’. సూర్యకిరణ్‌ ఇలాదిని దర్శకునిగా పరిచయం చేస్తూ నీలిమ ప్రొడక్షన్స్‌ పతాకంపై పల్లెర్ల ఆనంద్‌

ఆనంద్‌కృష్ణ, వృశాలి జంటగా లవ్, యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘నీలిమలై’. సూర్యకిరణ్‌ ఇలాదిని దర్శకునిగా పరిచయం చేస్తూ నీలిమ ప్రొడక్షన్స్‌ పతాకంపై పల్లెర్ల ఆనంద్‌ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మానవీయ విలువల నేపథ్యంలో సాగే చిత్రమిది. చైల్డ్‌ సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. ఆనంద్‌కృష్ణ, బేబీ అర్చితల మధ్య సన్నివేశాలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. రీ–రికార్డింగ్‌ టైమ్‌లో మంచి సినిమా చేశారని సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ అభినందించడం మా చిత్ర విజయానికి తొలి ప్రశంస అనుకుంటున్నాం. అయ్యప్పస్వామి భక్తులకు మా చిత్రం ఒక కానుక. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చే వాణిజ్య అంశాలున్నాయి. అతి త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. భానుచందర్, అలీ, సత్యప్రకాశ్, సాయికిరణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌కుమార్, పాటలు: దేవేంద్ర, సమర్పణ: నీలిమ.

Advertisement
Advertisement