ప్రభుదేవాతో మరోసారి.. | Tamannaah Romance Again With Prabhu Deva | Sakshi
Sakshi News home page

ప్రభుదేవాతో మరోసారి..

Jul 23 2018 8:34 AM | Updated on Jul 23 2018 8:34 AM

Tamannaah Romance Again With Prabhu Deva - Sakshi

తమిళసినిమా: దేవి చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని చవిచూసింది. అందులో జంటగా నటించిన ప్రభుదేవా, తమన్నా మరోసారి జతకట్టనున్నారన్నది తాజా వార్త. అవును ఈ హిట్‌ పెయిర్‌తో నటుడు, దర్శకుడు పార్థిబన్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వైవిధ్య కళా చిత్రాల దర్శకుడైన ఈయన కొడిట్ట ఇడంగళ్‌ విరంబుగా చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. దీని గురించి ఆయనే వెల్లడించారు. తాను ప్రభుదేవా హీరోగా చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రభుదేవాకు కథ వివరించానని తామిద్దం కలసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇది కమర్షియల్‌ అంశాలతో కూడిన రివెంజ్‌ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటించనున్నట్లు చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించేది నిర్ణయం కాలేదన్నారు. ఆ విషయాలన్ని ఒక కొలిక్కి వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు.  ఇందులో పార్థిబన్‌ కూడా నటిస్తారా? అన్నది వెల్లడించలేదు. అయితే ఇంతకుముందు ప్రభుదేవా, పార్థిబన్‌ కలిసి జేమ్స్‌బాండ్‌ చిత్రంలో నటించారన్నది గమనార్హం. మొత్తం మీద ఈ సంచలన కాంబినేషన్‌ ఒక భారీ చిత్రం రాబోతుందన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement