మా ఇద్దరి మధ్య ఏమీ లేదు

Tamannaah Bhatia Finally Opens Up About Her Alleged Ex Virat Kohli - Sakshi

వినోద ప్రపంచంలో ఎక్కువగా ఆకర్షించేవి సినిమా, క్రీడలు. అది కూడా స్పోర్ట్స్‌లో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. సినిమా, క్రీడలను కలిపేది యాడ్స్‌. క్రికెటర్స్, మూవీ స్టార్స్‌ కలసి యాడ్‌ ఫిల్మ్స్‌లో కనిపించడం చాలాసార్లు చూశాం. 2012లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, హీరోయిన్‌ తమన్నా ఓ యాడ్‌ ఫిల్మ్‌ కోసం కలిశారు. ఆ స్మార్ట్‌ఫోన్‌ యాడ్‌ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, డేటింగ్‌ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి.

కానీ ఈ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలకు సమాధానం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆ విషయం మీద ఓ షోలో మాట్లాడారు తమన్నా. ‘‘యాడ్‌ షూట్‌ సమయంలో నేను, విరాట్‌ గట్టిగా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘ఆ యాడ్‌ తర్వాత మేమిద్దరం మళ్లీ కలవలేదు, మాట్లాడుకోనూ లేదు. కానీ నేను యాక్ట్‌ చేసిన చాలామంది యాక్టర్స్‌ కంటే కూడా విరాట్‌ చాలా బెటర్‌ యాక్టర్‌’’ అని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేనన్నారామె.

హృతిక్‌ ఒక్కరే మినహాయింపు
ఇదే షోలో మరికొన్ని విశేషాలు చెబుతూ – ‘‘సాధారణంగా సినిమాల్లో లిప్‌కిస్‌ సన్నివేశాలను చేయను నేను. ఏదైనా సినిమాకు సంతకం చేసేటప్పుడు నా కాంట్రాక్ట్‌లో ఆ నియమం కచ్చితంగా ఉంటుంది. కానీ హృతిక్‌తో కలసి నటిస్తే మాత్రం ఆ రూల్‌ని బ్రేక్‌ చేస్తానని సరదాగా ఫ్రెండ్స్‌తో జోక్‌ చేస్తుంటాను’’ అని పేర్కొన్నారామె.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top