నేను పుట్టుకతోనే ఎరుపు అయినా నాకు.. | Tamanna Comments on Saira narasimha Reddy First Look | Sakshi
Sakshi News home page

అలా అనుకుంటే ప్రమాదమే!

Dec 22 2018 7:21 AM | Updated on Dec 22 2018 7:21 AM

Tamanna Comments on Saira narasimha Reddy First Look - Sakshi

సినిమా: అలా అనుకుంటే చాలా ప్రమాదకరం అంటోంది నటి తమన్నా. సినీ వర్గాలు ఈ అమ్మడిని మిల్కీబ్యూటీ అని అంటుంటారు. ఈ మార్వాడి బ్యూటీ అంత ఎర్రగా, బుర్రగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నటిగా ఎక్కువ కాలం తన అందాలతోనే నెట్టుకొచ్చిందని చెప్పవచ్చు. తమన్నానే కాదు చాలా మంది హీరోయిన్లదిప్పుడు ఇదే బాట. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ అంటూ అన్ని భాషల్లోనూ ఒక రౌండ్‌ చుట్టేసిన తమన్నా తన మేనందానికి కుర్రకారు పడి చస్తుంటే తనకు మాత్రం ఎరుపు అసలు నచ్చదంటోంది. నలుపు రంగే తనకిష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రభుదేవాతో కలిసి దేవి–2 చిత్రంలోనూ, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రలోనూ నటిస్తున్న తమన్నా శరీర రంగు గురించి ఏమంటుందో చూద్దాం.

శరీర రంగును బట్టి ఒక మనిషి మనస్తత్వం గురించి చెప్పడాన్ని నేను అంగీకరించను. నేను పుట్టుకతోనే ఎరుపు. అయినా నాకు నలుపు రంగు అంటే ఇష్టం. కొన్ని చిత్రాల్లో దర్శకులు నా రంగును తగ్గించుకోమని చెబుతుంటారు. అందుకు నేను ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరిస్తాను. ఇప్పుడు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి, దేవి–2 చిత్రాలకు నా ఒరిజినల్‌ శరీర రంగును తగ్గించుకుని నటిస్తున్నాను. అలా చేయడం గొప్ప అని నేను అనుకోవడం లేదు. సినిమా తనాన్ని బ్రేక్‌ చేయాలని భావిస్తున్నాను. రంగే అందాన్ని తీర్మానిస్తుందన్న భావాన్ని మానుకోవలసిన కాలం ఇది. మీరు ఇతరుల కంటే అందంగా ఉండవచ్చు. అయితే మనసు క్రూరంగా ఉంటే అది అందం కాదు. రంగును బట్టి మనుషుల్ని లెక్క కడితే అంతకంటే భయంకరం ఇంకోటి ఉండదు. సినిమా విషయానికి వస్తే మేనందం గురించి ప్రశంసించడం కంటే అభినయాన్ని అభినందించడమే నిజమైన అభినందన అవుతుందన్నది నా భావన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement