నేను స్టార్‌ని కాను | taapsee says iam not a star | Sakshi
Sakshi News home page

నేను స్టార్‌ని కాను

Jun 9 2019 1:01 AM | Updated on Jun 9 2019 1:01 AM

taapsee says iam not a star - Sakshi

తాప్సీ

బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్‌ తాప్సీ. వీలైనప్పుడు సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇంతలా అవకాశాలు తాప్సీ వెంట పడుతున్నా తానేమీ స్టార్‌ని కాదంటున్నారామె. ఈ విషయం గురించి తాప్సీ చెబుతూ– ‘‘ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌ ఒకరే ఉంటారు.. మిగిలిన వారంతా స్టార్స్‌. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌ సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి.

కానీ నా సినిమాలకు ఆ రేంజ్‌ కలెక్షన్స్‌ను నేను ఊహించుకోలేను. నేను ఎలాంటి సినిమా చేశా? మిగతా స్టార్స్‌ ఎవరు? ఏ జానర్‌? అని ఆలోచించకుండా కేవలం సినిమాలో తాప్సీ ఉందని ఆడియన్స్‌ టికెట్స్‌ కొంటారో అప్పుడే నన్ను నేను ఓ స్టార్‌గా ఫీల్‌ అవుతాను. అప్పటివరకు నేను యాక్టర్‌ని మాత్రమే. స్టార్‌ని కాను. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండే నిడివి ఎక్కువా? తక్కువా? అని  ఆలోచించను’’ అని చెప్పారు తాప్సీ. ‘మిషన్‌మంగళ్, సాండ్‌కి ఆంఖ్, గేమ్‌ ఓవర్‌’ చిత్రాల షూటింగ్స్‌ను కంప్లీట్‌ చేసిన తాప్సీ కొత్త సినిమాల కోసం కథలు వినే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement