మరోసారి సందీప్ సాహసం | Sundeep Kishan dons khaki in C.V. Kumar's 'Mayavan' | Sakshi
Sakshi News home page

మరోసారి సందీప్ సాహసం

Feb 16 2016 9:31 PM | Updated on Sep 15 2019 12:38 PM

మరోసారి సందీప్ సాహసం - Sakshi

మరోసారి సందీప్ సాహసం

మరోసారి పోలీసు పాత్రకు సందీప్ కిషన్ రెడీ అయిపోయాడు. ఆయన గతంలో పోలీసు అధికారిగా నటించిన చిత్రం ఇంకా విడుదల కాకపోయినప్పటికీ తిరిగి తన తదుపరి చిత్రంలో సందీప్ కిషన్ మరోసారి పోలీసు అధికారిగా కనిపించనున్నాడు.

చెన్నై: మరోసారి పోలీసు పాత్రకు సందీప్ కిషన్ రెడీ అయిపోయాడు. ఆయన గతంలో పోలీసు అధికారిగా నటించిన చిత్రం ఇంకా విడుదల కాకపోయినప్పటికీ తిరిగి తన తదుపరి చిత్రంలో సందీప్ కిషన్ మరోసారి పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. నిర్మాత సీవీ కుమార్ దర్శకుడుగా మారి రూపొందిస్తున్న 'మాయావన్' అనే చిత్రంలో ఆయన పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రాబోతుంది. వైజ్ఞానిక కాల్పనిక అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి.

'నేను ముక్కోపి, వాస్తవ దష్టి కలిగిన పోలీసుగా కనిపిస్తాను. కుమార్, నేను చాలా కాలంగా స్నేహితులం. మేం కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని సందీప్ అన్నాడు. అంతకు ముందు డీకే బోసు చిత్రంలో కూడా పోలీసుగా సందీప్ నటించాడు. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లేను నలన్ కుమారస్వామి అందిస్తుండగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుంది. డానియెల్ బాలాజీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement