రిటైర్మెంట్ ప్రకటించనున్న సుకుమార్..? | Sukumar To Quit Direction | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్రకటించనున్న సుకుమార్..?

Jan 22 2016 10:50 AM | Updated on Sep 3 2017 4:07 PM

రిటైర్మెంట్ ప్రకటించనున్న సుకుమార్..?

రిటైర్మెంట్ ప్రకటించనున్న సుకుమార్..?

'నాన్నకు ప్రేమతో' లాంటి భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సుకుమార్ త్వరలోనే అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడట.

'నాన్నకు ప్రేమతో' లాంటి భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సుకుమార్ త్వరలోనే అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడట. ఇంత ఫాంలో ఉన్న సమయంలోనే దర్వకుడిగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే ఈ లెక్కల మాస్టర్ మరో రెండు సినిమాలు చేసిన దర్శకత్వం నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రొడక్షన్ స్థాపించిన సుకుమార్. ఆ బ్యానర్ పై 'కుమారి 21 ఎఫ్' సినిమాను నిర్మించిన మంచి విజయం సాధించాడు. భవిష్యత్తులో కూడా తన బ్యానర్ ద్వారా తెరకెక్కే సినిమాలకు రచయితగా, నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సుక్కు, ఆ తరువాత మరో సినిమా చేసి డైరెక్షన్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement