పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు! | Sudheer Babu interview | Sakshi
Sakshi News home page

పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు!

Dec 24 2015 10:52 PM | Updated on Aug 20 2018 6:18 PM

పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు! - Sakshi

పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు!

ఈ చిత్రకథకు ఎస్టాబ్లిష్‌డ్ హీరోలు, విలన్లు, కమెడియన్లు అవసరం లేదు. రెగ్యులర్ ఫార్ములాకు

‘‘ఈ చిత్రకథకు ఎస్టాబ్లిష్‌డ్ హీరోలు, విలన్లు, కమెడియన్లు అవసరం లేదు. రెగ్యులర్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, కామెడీతో సాగే మంచి కమర్షియల్ మూవీ. సక్సెస్‌పరంగా ఇప్పటివరకూ ఏ సినిమాకీ కలగనంత నమ్మకం ఈ సినిమాతో కలిగింది’’ అని సుధీర్‌బాబు అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్‌బాబు, వామిక జంటగా విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన ‘భలే మంచి రోజు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మనోభావాలు...
 
  ఈ చిత్రనిర్మాతలు విజయ్, శశి నా కాలేజ్‌మేట్స్, అలాగే రూమ్మేట్స్ కూడా. కృష్ణగారికి విజయ్ పెద్ద ఫ్యాన్. ఆయన డైలాగ్స్ అప్పజెబుతుండేవాడు. హీరోగా నన్ను బాగా ప్రమోట్ చేయడం కోసమే వాళ్ళు ఈ సినిమా తీశారు. బడ్జెట్ ఎక్కువ పెట్టొద్దన్నప్పటికీ రాజీపడలేదు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటిలోకీ ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.
 
శ్రీరామ్ ఆదిత్య చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూశాను. కేవలం కుర్చీలు, బల్లలు, ఫ్యాన్స్‌తో తను తీసిన ఓ థ్రిల్లర్ నాకు చాలా నచ్చింది. అందుకే తన దర్శకత్వంలో చేయాలనుకున్నాను.
 
  ఈ చిత్రకథను ఎంత పెద్ద దర్శకుల దగ్గర చెప్పినా, తర్వాతి సీన్ ఏమిటనేది ఊహించలేకపోయారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే కథ ఇది. బెంజ్ షోరూమ్‌లో పని చేసే అబ్బాయి పాత్ర నాది. ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆ అబ్బాయి ఎలాంటి వ్యక్తులను కలుస్తాడు? తర్వాత జరిగే పరిణామాలేంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది.
 
హీరోను కాకముందు నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విజయ్‌తో కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. హీరో ప్రభాస్‌కి వంశీ మంచి స్నేహితుడనే విషయం తెలిసిందే. వంశీ ద్వారా ప్రభాస్‌తో ఈ సినిమా గురించి చెప్పాం. పూర్తి సినిమా చూడలేదు కానీ, ప్రభాస్ దాదాపు చూసినట్లే. మహేశ్‌బాబు ఇంకా చూడలేదు. ‘ఈ సినిమా తర్వాత సుధీర్ స్టార్ హీరో అవుతాడు’ అని మహేశ్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా మీద తనకంత నమ్మకం.
 
ప్రస్తుతం హిందీలో ‘భాగీ’ అనే సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. హీరోగా ఇప్పటివరకూ చేయనంత స్ట్రాంగ్ రోల్ అది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు ప్రిపేర్ అయినట్లుగా ఈ సినిమా కోసం చాలా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement