వ్యూహమా? విక్టరీయా? | Sudheer Babu and Nani V Movie Launched | Sakshi
Sakshi News home page

వ్యూహమా? విక్టరీయా?

Apr 30 2019 2:04 AM | Updated on Aug 11 2019 12:30 PM

Sudheer Babu and Nani V Movie Launched - Sakshi

‘దిల్‌’ రాజు, శిరీష్, సుధీర్‌బాబు, అదితీరావ్‌ హైదరీ, మోహనకృష్ణ ఇంద్రగంటి, నివేదా థామస్, నాని

నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా, జెంటిల్‌ మన్‌’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే సుధీర్‌బాబు, ఇంద్రగంటి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ‘వి’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ‘వి’ అంటే విక్టరీ అని ఊహించవచ్చు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా, అదితీరావు హైదరీ, నివేదా థామస్‌ హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంలో 36వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు శ్రీరామ్‌ వేణు క్లాప్‌ ఇచ్చారు. ‘ఎఫ్‌2’ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, వి.కె. నరేష్, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమెరా: పి.జి.విందా, సంగీతం: అమిత్‌ త్రివేది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement