టమోటా పులిహోర | SS Rajamouli Direction in Kitchen | Sakshi
Sakshi News home page

టమోటా పులిహోర

Sep 12 2013 12:28 AM | Updated on Sep 1 2017 10:37 PM

టమోటా పులిహోర

టమోటా పులిహోర

ఎప్పుడూ స్టార్ట్... యాక్షన్... కట్ అంటూ సినిమాయే ప్రపంచం అని బతికేస్తే ఇక మజా ఏముంటుంది? ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడిపితే, అది కూడా వంటింట్లో భార్యకు సహాయం చేస్తే లభించే ఆనందమే వేరు. ఇటీవల రాజమౌళి ఆ ఆనందాన్ని ఆస్వాదించారు.

రాజమౌళి మంచి దర్శకుడు మాత్రమే కాదు.. మంచి కొడుకు, భర్త, తండ్రి కూడా. వీలు కుదిరినప్పుడు కాకుండా వీలు చేసుకుని మరీ కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. ఇటీవల కొంత సమయాన్ని వంట గదిలో గడిపారు. ‘టమోటా పులిహోర’ కలపడానికి ఓ చెయ్యేశారాయన. చింతపండు, దబ్బకాయ.. ఇలా రకరకాల పులిహోరలు విన్నాం కానీ, టమోటా పులిహోర అంటే అరుదనే చెప్పాలి.
 
ఈ పులిహోర చేయడంలో నా భార్య రమ ప్రతిభే వేరంటున్నారు రాజమౌళి. ఎంచక్కా పోపు, అన్నాన్ని రమ కలిపితే, చివరగా ఈ మిక్సింగ్‌లో ఓ చెయ్యేశారు రాజమౌళి. ఈ తతంగాన్ని ఫొటో తీసి, ట్విట్టర్‌లో పెట్టారాయన. షూటింగ్ స్పాట్స్‌లో మెగాఫోనో, కెమెరానో పట్టుకుని కనిపించే రాజమౌళి ఇలా... కనిపించడం తమాషాగా ఉంది కదూ!
 
Advertisement
 
Advertisement
Advertisement