ముంబైలో ఉంటా.. సింగపూర్‌లోనూ కనిపిస్తా! | Sridevi doll in Singapore restaurant | Sakshi
Sakshi News home page

ముంబైలో ఉంటా.. సింగపూర్‌లోనూ కనిపిస్తా!

Nov 27 2017 1:17 AM | Updated on May 29 2019 3:19 PM

Sridevi doll in Singapore restaurant  - Sakshi - Sakshi - Sakshi

అది సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్‌. అక్కడ శ్రీదేవి ఉన్నారు. సంవత్సరం పొడవునా అక్కడే ఉంటారు. ఆ మాటకొస్తే ఏళ్ల తరబడి అక్కడే ఉంటారు. శ్రీదేవి ఏంటి? రెస్టారెంట్‌లో ఉండటమేంటి? ముంబై నుంచి సింగపూర్‌కి మకాం మార్చేశారా? ఒకవేళ మార్చినా రెస్టారెంట్‌లో ఉండటం ఏంటి? అనుకుంటున్నారా! ఆ రెస్టారెంట్‌లో శ్రీదేవి కనిపించే మాట నిజమే. అయితే ‘బొమ్మ’ రూపంలో. అదండీ అసలు మేటర్‌. ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవికి అభిమాలున్న విషయం తెలిసిందే. సింగపూర్‌ రెస్టారెంట్‌కి సంబంధించిన వాళ్లల్లో శ్రీదేవి అభిమాని ఉన్నారు.

అంతే... అచ్చంగా ఆమెలా ఓ బొమ్మ తయారు చేయించి, రెస్టారెంట్‌లో పెట్టారు. ‘‘ఇండియాలోనూ, విదేశాల్లోనూ శ్రీదేవి పేరు మీద బోలెడన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఆమెకు ఎంత స్టార్‌డమ్‌ ఉందో తెలియజేయడానికి ఇదో ఎగ్జాంపుల్‌’’ అని శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ అన్నారు. ‘‘నాకు మాటలు రావడం లేదు. నా పేరును ఎంతో స్వీట్‌గా ఇలా వాడుకుంటున్నారు. యాభై ఏళ్లుగా అభిమానుల ఆలోచనల్లో నేను ఉంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఐ యామ్‌ బ్లెస్డ్‌’’ అన్నారు శ్రీదేవి. ఏది ఏమైనా... శ్రీదేవి అంటే పేరు కాదు, ఇట్స్‌ ఏ బ్రాండ్‌ అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement