సీక్వెల్‌ పార్టీ | Sequel party | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ పార్టీ

Jan 21 2018 3:43 AM | Updated on Jan 21 2018 3:43 AM

Sequel party - Sakshi

బడ్జెట్‌ 4 కోట్లు.. వసూళ్లు 50 కోట్లు. ఇలాంటి సినిమా తీస్తే తీసినవాళ్లు, కొన్నవాళ్లు పార్టీ చేసుకుంటారు. మంచి సినిమా చూసినందుకు ఆడియన్స్‌ పండగ చేసుకుంటారు. ‘కిరిక్‌ పార్టీ’ అలాంటి సినిమానే. 2016లో విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీకి రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించారు.

రక్షిత్‌ శెట్టి మెయిన్‌ లీడ్‌ చేశారు. ఈ సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌ తీయాలనే ప్లాన్‌లో ఉన్నామని రక్షిత్‌ శెట్టి పేర్కొన్నారు. ఆల్రెడీ ‘కిరిక్‌ పార్టీ 2’ అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్‌ చేసేశారు. అయితే రక్షిత్‌ ప్రస్తుతం ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే సినిమాతోనూ, రిషబ్‌ శెట్టి వేరే సినిమాతోనూ బిజీగా ఉన్నారు.

అవి పూర్తయ్యాక సీక్వెల్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ‘‘మోస్ట్‌లీ ఈ ఏడాది మేలో స్టార్ట్‌ చేసే అవకాశం ఉంది’’ అని రక్షిత్‌ పేర్కొన్నారు. అన్నట్లు.. ‘కిరిక్‌ పార్టీ’ తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. నిఖిల్‌ హీరోగా ‘కిరాక్‌ పార్టీ’ పేరుతో ఈ సినిమా వచ్చే నెల 9న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement