బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’ | Satish Kaushik to Remake Siva Puthrudu in Hindi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

Feb 21 2019 4:19 PM | Updated on Feb 21 2019 4:19 PM

Satish Kaushik to Remake Siva Puthrudu in Hindi - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, విక్రమ్‌లు కలిసి నటించిన సూపర్‌ హిట్‌ సినిమా పితామగన్‌. తెలుగులో శివపుత్రుడు పేరుతో రిలీజ్‌ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

విక్రమ్‌కు నటుడిగా ఎంతో పేరుతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టిన శివపుత్రుడు పాత్రను హిందీ లో ఎవరు చేయబోతున్నారన్న అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా బాలా ఇమేజ్‌ను కూడా శివపుత్రుడు తారా స్థాయికి తీసుకెళ్లింది. హిందీ రీమేక్‌కు సతీష్ కౌషిక్‌ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. గతంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సేతు సినిమాను తేరే నామ్‌ పేరుతో రీమేక్‌ చేసిన సతీష్‌ ఇప్పుడు శివపుత్రుడును కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement