షారుక్ 'లుంగీ డ్యాన్స్'కు సంజయ్ దత్ తీన్ మార్! | Sanjay Dutt to perform Shah Rukh Khan’s 'Lungi Dance' of Chennai Express | Sakshi
Sakshi News home page

షారుక్ 'లుంగీ డ్యాన్స్'కు సంజయ్ దత్ తీన్ మార్!

Sep 16 2013 4:19 PM | Updated on Sep 1 2017 10:46 PM

షారుక్ 'లుంగీ డ్యాన్స్'కు సంజయ్ దత్ తీన్ మార్!

షారుక్ 'లుంగీ డ్యాన్స్'కు సంజయ్ దత్ తీన్ మార్!

'చెన్నె ఎక్స్ ప్రెస్' చిత్రంలో షారుక్ ఖాన్ చేసిన లుంగీ డ్యాన్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

'చెన్నె ఎక్స్ ప్రెస్' చిత్రంలో షారుక్ ఖాన్ చేసిన లుంగీ డ్యాన్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం పూణెలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షారుక్ లుంగీ డ్యాన్స్ కు స్టెప్పులు వేయనున్నాడు. జైలు సిబ్బంది సంక్షేమం కోసం నిధులను సేకరించడానికి ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో సంజయ్ దత్ కూడా పాల్గొననున్నాడు. రెండున్నర గంటలపాటు జరిగే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26 తేదిన జరుగనుంది. ఈ నిధులను ఖైదీల సౌకర్యానికి కూడా వినియోగించనున్నట్టు జైలు అధికారులు తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఖైదీలు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. సంజయ్ దత్ చేసే డ్యాన్స్ ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు. ప్రదర్శనలో మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఇటీవల 'చెన్నై ఎక్స్ ప్రెస్' సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంజయ్ దత్ ఆ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టిని లేఖ ద్వారా ప్రశసించారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement