అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో | Salman shares mother's pic with newborn nephew | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో

May 3 2016 2:14 PM | Updated on Sep 3 2017 11:20 PM

అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో

అమ్మమ్మ, మనవడు..ఓ ఫోటో

చిన్నారి ఆహిల్ రాకను ఘనంగా ఆహ్వానించిన బాలీవుడ్ కండల వీరుడు తాజాగా క్యూట్ ఫోటో నొకదాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'అమ్మమ్మ సల్మా, మనవడు ఆహిల్ ' అంటూ ఒక ముచ్చటైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్  సల్మాన్ ఖాన్  తన నిజజీవితంలో వచ్చిన సరికొత్త ప్రమోషన్ బాగా  ఎంజాయ్ చేస్తున్నాడు. తన ముద్దుల మేనల్లుడు ఆహిల్  ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ  సంతోషాన్ని  రెట్టింపు  చేసుకుంటున్నాడు.   చిన్నారి ఆహిల్ రాకను ఘనంగా ఆహ్వానించిన బాలీవుడ్ కండల వీరుడు తాజాగా క్యూట్ ఫోటో నొకదాన్ని అభిమానులతో పంచుకున్నాడు.  'అమ్మమ్మ సల్మా,  మనవడు ఆహిల్ '  అంటూ ఒక ముచ్చటైన ఫోటోను  సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు.   అమ్మ సల్మా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న మేనల్లుడు ఫోటోను  ట్విట్టర్ లో షేర్ చేశాడు సల్మాన్.

 
 కాగా  సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, అయూష్  శర్మ దంపతులకు ఈ  మార్చి 30న ఆహిల్ పుట్టాడు. ఈ నేపథ్యంలో  మేనల్లుడి రాకతో మురిసిపోతున్న  సల్మాన్‌ తన బుజ్జి మేనల్లుడు అహిల్‌కు ఇటీవల  ఒక ఖరీదైన కారును కూడా  బహుమతిగా  ఇచ్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement