నన్ను స్కూల్‌ నుంచి పంపేశారు: హీరో

Salman Khan Says He Faced Difficult Situation In School Days - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. తారా శర్మ షోలో సల్మాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు స్కూల్‌ అడ్మిషన్‌ రావడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. తనకు తల్లిదండ్రులంటే చాలా ఇష్టమని పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు. నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు తనను స్కూల్‌ యాజమాన్యం పంపేసిందని తెలిపాడు. ఆ సమయంలో తానేమి తప్పు చేశానో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే పాఠశాలకు వెళ్లాల్సిందిగా స్కూలు యాజమాన్యం సిఫార్సు చేసినప్పటికీ.. తాను అక్కడే  చదువుతానని అభ్యర్థించగా వారు అంగీకరించారని పేర్కొన్నాడు. అలా అదే పాఠశాలలోనే చదివి ఉత్తీర్ణత సాధించానని గుర్తుచేసుకున్నాడు.

అదే విధంగా... తన స్కూల్‌ ప్రిన్సిపల్‌తో జరిగిన సంఘటనను కూడా సల్మాన్‌ పంచుకున్నాడు. తాను కాలేజీలో సైన్స్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలియగానే నన్ను చెరకు కర్రతో దండించాడని చెప్పాడు. తన నైపుణ్యమేంటో ప్రిన్సిపల్‌ సార్‌కు బాగా తెలుసునని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం సల్మాన్‌ నటించిన దబాంగ్‌ 3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 20న విడుదలై నాలుగు రోజుల్లో రూ.91.85 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ కనిపించగా ఆయన సరసన బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.
చదవండి: నీరసించిన ‘దబాంగ్‌ 3’ కలెక్షన్లు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top