ఒకే బ్యానర్లో మూడు సినిమాలు..! | Sai Pallavi three Movies in Dil raju Banner | Sakshi
Sakshi News home page

ఒకే బ్యానర్లో మూడు సినిమాలు..!

Jul 16 2017 12:44 PM | Updated on Sep 5 2017 4:10 PM

ఒకే బ్యానర్లో మూడు సినిమాలు..!

ఒకే బ్యానర్లో మూడు సినిమాలు..!

మలయాళ సినిమా ప్రేమమ్తో సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి.

మలయాళ సినిమా ప్రేమమ్తో సౌత్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం ఈ భామ వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాలో నటిస్తోంది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాతో పాటు అదే బ్యానర్ లో మరో రెండు సినిమాలకు ఓకె చెప్పిందట సాయి పల్లవి. ఫిదా సినిమాతో పాటు ఒకేసారి మూడు సినిమాలు చేసేలా దిల్ రాజు సాయి పల్లవితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంతేకాదు మూడు సినిమాలకు కలిపి పేమెంట్ కూడా ఒకేసారి చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఫిదా సినిమాను పూర్తి చేసిన ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఎమ్సీఏ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత కూడా దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేయనుంది. ప్రస్తుతం సతీష్ వేగ్నేష్, దశరథ్, శ్రీకాంత్ అడ్డాలలు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు రెడీ ఉన్నారు. వీటిలో ఏదో ఒక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement