
సంగీత ప్రియులను అలరించే పాత పాటలను రీమిక్స్ చేయడం టాలీవుడ్‌లో కొత్తేం కాదు. సమయానుకూలంగా చాలా మంది హీరోలు పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్నింటిని సందర్భానుసారం వాడుకుంటుంటే, మరికొంత మంది సెంటిమెంట్ కోసం రీమిక్స్ చేస్తారు. మెగా మేనళ్లుడు సైతం ఇప్పటికే రెండు సూపర్‌డూపర్ హిట్ పాటలను తన సినిమాల్లో వాడేశాడు.
వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో సాయి ధరమ్ తేజ్ మళ్లీ రీమిక్స్ మార్గం ఎంచుకున్నాడు. మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో మామయ్య మెగాస్టార్ పాటలను తిరిగి రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు సాయి. ఇందుకోసం కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాటను రీమిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి మామయ్య సాంగ్ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.