ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?

RaviTeja Young Look From Disco Raja Real Or Fake - Sakshi

సినిమా నిర్మాణంలో టెన్నాలజీ, ప్రొస్తెటిక్స్‌ లాంటి వాటి రాకతో నటీనటులను ఎలా కావాలంటే అలా మార్చేస్తున్నారు. వయసు పెంచి, తగ్గించి చూపిస్తున్నారు. చాలా ఏళ్ల కిందటే భారతీయుడు సినిమా కోసం కమల్‌ వృద్ధుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇటీవల ఫ్యాన్‌ సినిమాలో షారూఖ్‌ కుర్రాడిలా కనిపించి మెప్పించాడు.

తాజాగా అలాంటి ప్రయోగానికే రెడీ అవుతున్నాడు మాస్‌ మహరాజ్ రవితేజ. ప్రస్తుతం ఈ సీనియర్‌ హీరో ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఒకటి తన ఇమేజ్‌కు తగ్గ మాస్‌ లుక్‌, కాగా మరోటి యంగ్‌ లుక్‌ అని తెలుస్తోంది.

తాజాగా రవితేజ్‌ యంగ్‌ లుక్‌కు సంబంధించిన ఫోటో అంటూ.. ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో రవితేజ 25 ఏళ్ల కుర్రాడిల కనిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇది నిజంగానే సినిమాలో పాత్రా, లేక అభిమానులు ఎవరైనా ఫేస్‌ యాప్‌ లాంటి టెక్నాలజీ ద్వారా చేశారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. గత కొద్ది రోజులు ఈ చిత్ర షూటింగ్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే స్విట్జర్లాండ్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top