రాజా చలో ఢిల్లీ

Ravi Teja Disco Raja Next Schedule In Delhi - Sakshi

డిస్కో రాజా హైదరాబాద్‌లో చాలా జోరుగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అదే జోరుతో త్వరలో చలో ఢిల్లీ అంటూ ఫ్లైట్‌ ఎక్కబోతున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తోన్న చిత్రం ‘డిస్కో రాజా’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌ పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేష్‌ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.  కోటీ 20 లక్షల రూపాయలతో వేసిన సెట్‌లో రవితేజ, ‘వెన్నెల’ కిశోర్, శశిర్‌ షరమ్, టోని హోప్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

  ఈ నెల 26వరకూ ఇక్కడ చిత్రీకరించి ఆగస్ట్‌ మొదటివారంలో ఢిల్లీలో కొత్త షెడ్యూల్‌ మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ – ‘‘నేల టిక్కెట్‌’ తర్వాత రవితేజగారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఆయన ఎనర్జీ సూపర్‌. వీఐ ఆనంద్‌ గొప్ప విజన్‌ ఉన్న దర్శకుడు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, డైలాగ్స్‌: అబ్బూరి రవి, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌. తమన్, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top