
మాస్ మహారాజా రవితేజ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు హల్‌చల్‌చేశాయి. వి.ఐ ఆనంద్ డైరెక్షన్‌లో రాబోతోన్న డిస్కో రాజా చిత్రం.. బడ్జెట్ కారణంగా వచ్చిన విభేదాల వల్ల నిలిచిపోయిందని, ప్రాజెక్ట్ క్యాన్సల్ అయిందనే రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ వార్తలపై తెలివిగా స్పందించింది. ఒక్క ప్రకటనతో అందరికీ సమాధానం చెప్పేసింది.
డిస్కోరాజా చిత్రం రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీన్నిబట్టి షూటింగ్ సజావుగా సాగుతోందని, మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌ను మే 27 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
We are Happy to Announce #Discoraja second schedule starts from May 27th#DiscorajaSecondSchedule @RaviTeja_offl @itsRamTalluri #VIAnand @vennelakishore @starlingpayal @NabhaNatesh @MusicThaman @abburiravi pic.twitter.com/UEP2RaDtYo
— SRT Entertainments (@SRTmovies) May 6, 2019