రంగమ్మ.. మంగమ్మ.. ఏం పిల్లడూ! | Rangamma Mangamma Song Released | Sakshi
Sakshi News home page

Mar 8 2018 6:29 PM | Updated on Mar 8 2018 6:29 PM

Rangamma Mangamma Song Released - Sakshi

సాక్షి, సినిమా : మెగా అభిమానుల్లో ఇప్పుడు ఒక్కటే ఆలోచన. రంగస్థలం చిత్రం ద్వారా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తెరపై చేసే సందడి ఎలా ఉంటుంది అని. దానికి ముందే ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ఎంత సక్కగున్నావే లచ్చిమి, రంగా రంగా రంగస్థలానా సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూడో సాంగ్‌ను విడుదల చేశారు. 

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ...పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు అంటూ సాగే పాట అది. చంద్రబోస్‌ సాహిత్యం.. మానసి గాత్రం.. దానికి దేవీ అందించిన బాణీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చెర్రీని ఏడిపిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్కు కూడా బావుంది .వినసొంపుగా ఉన్న ఈ పాట విజువల్స్‌తో సుకుమార్‌ ఆకట్టుకునేలా తీర్చిదిద్ది ఉంటాడనిపిస్తోంది.

రామ్‌ చరణ్‌, సమంత, ఆదిపినిశెట్టి, జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న రంగస్థలాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించి.. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చే యత్నం చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement