ప్రతీసారి రణ్ బీర్ కోసం వెయిట్ చేయలేను! | Ranbir cannot work in all my films,says Anurag Basu | Sakshi
Sakshi News home page

ప్రతీసారి రణ్ బీర్ కోసం వెయిట్ చేయలేను!

Aug 19 2014 4:06 PM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రతీసారి రణ్ బీర్ కోసం వెయిట్ చేయలేను! - Sakshi

ప్రతీసారి రణ్ బీర్ కోసం వెయిట్ చేయలేను!

బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తో స్నేహం ఉన్నప్పటికీ అతనితో సినిమా చేయడం కోసం ప్రతీసారి నిరీక్షించలేనని దర్శకుడు అనురాగ్ బసూ స్పష్టం చేశాడు.

న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తో స్నేహం ఉన్నప్పటికీ అతనితో సినిమా చేయడం కోసం ప్రతీసారి నిరీక్షించలేనని దర్శకుడు అనురాగ్ బసూ స్పష్టం చేశాడు. తమ స్నేహం మాట ప్రక్కన పెడితే రణ్ బీర్ స్టార్ హోదా సంపాదించాక ఇక అతనితో సినిమాలు చేయలేమోనని తెలిపాడు. 2012 లో వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన 'బర్ఫీ' చిత్రం అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రణ్ బీర్-అనురాగ్ ల నేతృత్వంలో 'జగ్గా జాసూస్' నవంబర్ నుంచి ఆరంభం కానుంది. అయితే ఈ చిత్రం  పూర్తయిన తరువాత రణ్ బీర్ తో డేట్స్ కోసం తాను నిరీక్షించలేనని అనురాగ్ తెలిపాడు.

 

'మేమిద్దరం స్నేహితులం. ఇప్పటికే ఒక చిత్రాన్ని తెరకెక్కించి, మరో చిత్రానికి రంగం సిద్ధం చేశాం. ఇద్దరం కూడా బాగా కనెక్ట్ అయ్యాం. నా తరువాత ప్రాజెక్ట్ ఇంకా సిద్ధం కాలేదు. రణ్ బీర్ కూడా బిజీగా ఉంటాడు. అతని కాల్ షీట్స్ కోసం ప్రతీసారి వెయిట్ చేయలేను.ఇక రణ్ బీర్ నాతో సినిమాలను చేయలేకపోవచ్చు' అని అనురాగ్ బసూ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement