శాస్త్రవేత్తగా.. రానా హాలీవుడ్ ఎంట్రీ | Rana to play a scientist in his debut Hollywood film | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తగా.. రానా హాలీవుడ్ ఎంట్రీ

Sep 16 2017 3:22 PM | Updated on Sep 22 2017 7:00 PM

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాల్ యాక్టర్ రానా..

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాల్ యాక్టర్ రానా.. ఈ భల్లాలదేవుడు హీరోగా ఓ హాలీవుడ్ సినిమా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చాలా కాలం కిందటే రానా స్వయంగా ప్రకటించారు. లీడ‌ర్ సినిమాతో వెండితెరకు ప‌రిచ‌య‌మైన రానా టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు.

ముఖ్యంగా బాహుబలి సినిమా జాతీయ స్థాయిలో మార్కెట్ సాధించటంలో రానా పాత్ర కీలకం. ఈ విషయాన్ని రాజమౌళి కూడా పలు సందర్భాల్లో ప్రస్థావించారు.  హీరోయిజాన్ని పక్కన పెట్టి డిఫరెంట్ రోల్స్లో న‌టిస్తున్న రానా లండ‌న్ డిజిట‌ల్ మూవీ మ‌రియు టీవి స్టూడియోస్ తో క‌లిసి లండ‌న్ బేస్డ్ మూవీ చేయ‌నున్నాడు. ఎల్ డీ ఎమ్ తో క‌లిసి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రానా శాస్త్రవేత్తగా నటించనున్నారట. ఇప్పటికే నావీ నేపథ్యంలో ఘాజీ సినిమాలో నటించిన రానా మరోసారి అదే తరహా సినిమాతో ఆకట్టుకోకున్నారు.

1888 నవంబర్ లో దాదాపు 700 మంది ప్రయాణికులతో సహా కనిపించకుండా పోయిన విజిల్ అనే భారీ నౌక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రానా ఆ నౌకను కనుగొనేందుకు సహకరించే శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. ద్వానిల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజిల్ : మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్ షిప్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ 2018లో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement