నెటిజన్‌ కౌంటర్‌కు సమాధానమిచ్చిన రానా | Rana Daggubati Counter On Netitigen Who Trolls Nepotism | Sakshi
Sakshi News home page

నెటిజన్‌ కౌంటర్‌కు రానా రిప్లై

Feb 11 2020 2:48 PM | Updated on Feb 11 2020 4:09 PM

Rana Daggubati Counter On Netitigen Who Trolls Nepotism - Sakshi

పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కించుకున్న తెలుగు కెరటం రానా దగ్గుబాటి. టాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల జెండా పాతిన ఈ దిగ్గజ నటుడు బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సాధించుకున్నాడు. ఆయన తాజాగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’. ఇది హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హీరో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏనుగు ముందు నిల్చొని ఆవేశంతో ఊగిపోతున్న రానా లుక్‌ అదిరిపోయిందంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఓ అభిమాని మాత్రం భల్లాలదేవపై సెటైర్‌ వేశాడు. గతంలో రానా ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో రానా మాట్లాడుతూ... ‘నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ, ఆ ఫలితాలు నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి’ అని పేర్కొన్నాడు.

దీనికి సదరు నెటిజన్ కౌంటర్‌ వేస్తూ.. ‘ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది’ అని వ్యంగ్యంగా కామెంట్‌ వేశాడు. దీంతో ఈ హీరో తన ఆగ్రహాన్ని లోపలే అణచివేసుకుని ‘అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే’ అంటూ కూల్‌గా చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక రానా సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చాడన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు కాగా వీరికి సొంతంగా సురేశ్‌ బ్యానర్‌ కూడా ఉంది. ఇక ఆయన తాతయ్య దివంగత దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్‌ మరిచిపోలేని బడా నిర్మాత. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్‌ రానాకు స్వయానా బాబాయ్‌ అవుతాడని తెలిసిందే. (డిఫరెంట్‌ లుక్‌లో రానా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement