యాపిల్ మహిళలు కూడా వస్తారా? | ramgopal varma wishes apple company makes apple women | Sakshi
Sakshi News home page

యాపిల్ మహిళలు కూడా వస్తారా?

Mar 16 2015 3:23 PM | Updated on Aug 20 2018 3:07 PM

యాపిల్ మహిళలు కూడా వస్తారా? - Sakshi

యాపిల్ మహిళలు కూడా వస్తారా?

ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలడం.. అవి లేవంటే కొత్తగా వివాదాలు సృష్టించడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే.

ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలడం.. అవి లేవంటే కొత్తగా వివాదాలు సృష్టించడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. అందులోనూ మహిళల మీద వ్యాఖ్యలు చేయమంటే ఆయన అందరికంటే ముందుంటారు కూడా. ఇప్పుడు తాజాగా అదే పనిచేశారు. ఓవైపు చేతిలో రెండు సినిమాలున్నా.. వాటి మధ్యలో ఖాళీ చూసుకుని మరీ ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోందని.. అంతా బాగానే ఉంది గానీ, మరి యాపిల్ మహిళలను కూడా తయారుచేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో చెప్పారు.

అలాగే.. అసలు లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో మనకంటే ఎక్కువ డబ్బుందని మొదలుపెట్టారు. అది లక్ష్మీదేవి లోపమా.. లేక ఆమెను పూజించే మన మూర్ఖత్వమా అని ప్రశ్నించారు. దటీజ్ వర్మ!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement