ఫైనల్గా రకుల్కు ఫిక్స్ అయ్యాడు | Ram roped rakul preeth for his next | Sakshi
Sakshi News home page

ఫైనల్గా రకుల్కు ఫిక్స్ అయ్యాడు

May 19 2016 1:20 PM | Updated on Jul 23 2019 11:50 AM

ఫైనల్గా రకుల్కు ఫిక్స్ అయ్యాడు - Sakshi

ఫైనల్గా రకుల్కు ఫిక్స్ అయ్యాడు

చాలా రోజులుగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూసిన యంగ్ హీరో రామ్, నేను శైలజ సినిమాతో అనుకున్నది సాధించాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన...

చాలా రోజులుగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూసిన యంగ్ హీరో రామ్, నేను శైలజ సినిమాతో అనుకున్నది సాధించాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ, రామ్ కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సక్సెస్ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనతో చాలా రోజులు గడిపేసిన రామ్ ఫైనల్గా కందిరీగ కాంబినేషన్లో సినిమా అంగీకరించాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు హీరోయిన్ను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.

ముందుగా సినిమాలో తమన్నాను హీరోయిన్గా తీసుకోవాలని భావించారు, అయితే గతంలో రామ్, తమన్నాల కాంబినేషన్లో వచ్చిన ఎందుకంటే ప్రేమంట ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తమన్నా కన్నా రాశీఖన్నా బెటర్ అని ఫీల్ అయ్యారు. అయితే రామ్, రాశీతో జోడి కట్టిన శివం సినిమా రిజల్ట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. ఫైనల్గా తనతో సక్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకున్న రకుల్ ప్రీత్సింగ్తో జోడి కట్టేందుకు ఫిక్స్ అయ్యాడు రామ్. పండగచేస్కో సినిమాతో పర్వాలేదని పించిన ఈ జంట ఇప్పుడు మరోసారి వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement