అది ఆర్జీవీ సీక్రెట్‌!

Ram Gopal Varma Press Meet about CLIMAX And CORONA VIRUS - Sakshi

‘‘ఆర్‌జీవీ వరల్డ్‌’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రా లు నేను తీయను. ఇంట్లోనే ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలు తీస్తాను’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ‘ఆర్‌జీవీ వరల్డ్‌’ అనే ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ‘క్లైమాక్స్‌’ చిత్రం ఈ యాప్‌లో విడుదల కానుంది. అలాగే వర్మ నేతృత్వంలోని మరో చిత్రం ‘కరోనా వైరస్‌’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతుంది. ‘ఆర్‌జీవీ వరల్డ్‌ యాప్‌’, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ల హవా వంటి విషయాలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. ఆ విశేషాలు..

► నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కలర్‌ సినిమాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం నుంచీ వెబ్‌సిరీస్‌ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడిదో (డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌) ప్యారలల్‌ ఇండస్ట్రీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌వంటి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్‌షిప్‌ పెరుగుతుందంటే ఆడియన్స్‌ చూస్తున్నట్లేగా. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌వారు కంటెంట్‌ కోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
     
► ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్‌లు ఉంటాయి. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకు వీకెండ్‌ ఓపెనింగ్స్‌ రావాలి. దీని పబ్లిసిటీ కోసం నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్స్‌ ఇలా మరికొన్ని పనులను చక్కబెట్టుకోవాలి. ఇంతా చేసిన తర్వాత ఆడియన్స్‌ థియేటర్స్‌కు వస్తారా? రారా? అనే టెన్షన్‌. మొబైల్‌లో సినిమా చూసినప్పుడు థియేటర్‌ ఫీల్‌ని మిస్‌ అవుతాం అనే ఫీల్‌ని పక్కనపెడితే డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. కొందరు నిర్మాతలకు ఇది ప్లస్‌.
     
► పెద్ద పెద్ద యాక్షన్‌ సినిమాలు, ‘బాహుబలి’ వంటి  విజువల్‌ వండర్‌ సినిమాలయితే థియేటర్‌లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్‌ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్‌ అవుతాయి. అలాగే ఫీచర్‌ ఫిల్మ్‌ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్‌’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే.
     
► ‘ఆర్‌జీవీ వరల్డ్‌’ ఐడియా నాకు ఎప్పటినుంచో ఉంది. ఇందులో ‘పే ఫర్‌’ వ్యూ విధానంలో చూడొచ్చు. చూసిన ప్రతిసారీ చార్జ్‌ చేస్తాం.  
     
► కమల్‌హాసన్‌ ‘డైరెక్ట్‌ హోమ్‌’ ఫార్మట్‌లో ‘విశ్వరూపం’ విడుదల ప్లాన్‌ చేశారు. అప్పుడు సెటప్‌ బాక్స్‌లు అందరికీ లేవు. కానీ ఈ నిర్ణయాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్న అడ్వాంటేజ్‌ ఏంటంటే థియేటర్స్‌ ఓపెన్‌ చేసి లేవు. ఎప్పుడు ఓపెన్‌ చేస్తారో కూడా తెలియదు.
     
► నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్‌’. ఇది నా దృష్టిలో ఒక హారర్‌ ఫిల్మ్‌. దెయ్యం బదులు వైరస్‌ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్‌ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్‌ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్‌’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్‌.
     

► ఫిల్మ్‌మేకింగ్‌ అనేది టీమ్‌ ఎఫర్ట్‌ అని నమ్ముతాను. అయితే సినిమాకు ఎవరు రూపకల్పన చేస్తారనేది ముఖ్యం. మా దగ్గర నేను చేస్తాను. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి క్రెడిట్‌ ఇస్తాను. ‘కరోనా వైరస్‌’ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్‌. ఆలోచన నాది. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది.
     
► జబ్బు, తుఫాన్, యాక్సిడెంట్‌... ఇలా ఏ కారణంతో అయినా మనకు చావు రావొచ్చు. ఈ జాబితాలో కరోనా వైరస్‌ కూడా చేరింది. కరోనా వైరస్‌ వెళ్లేట్లు లేదు. ఇంకేం చేస్తాం? దానితో కలిసి ఉండటమే. లాక్‌డౌన్‌ సమయంలో ‘క్లైమాక్స్,  కరోనా వైరస్‌’ చిత్రాల పనులు చూసుకున్నాను. నేను తాత (వర్మ కుమార్తె రేవతి ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది)ను అయ్యానని తెలిసినప్పుడు నాకేం అనిపించలేదు. చచ్చినట్లు కరోనా వైరస్‌ను భరించాలి. నేను తాతను అయ్యానన్నది భరించాలి.
     
► ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌ చివర్లో ఉన్న రెండు డైలాగ్స్‌ సెటైర్స్‌ కాదు. నా సినిమాకి నప్పుతాయని పెట్టాను. డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి చైనా వరకు కరోనా విషయంలో అందరూ చేయాల్సింది చేస్తున్నారు. అందుకే నేను ఎవరిపైనా సెటైర్‌ వేయలేదు.  

ఆ అమ్మాయంటే ఇష్టం
చాలామంది పోర్న్‌స్టార్స్‌ ఉన్నప్పటికీ ‘జీఎస్‌టీ’, ‘క్లైమాక్స్‌’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అమెరికన్‌ కపుల్‌ ఓ టూర్‌కి వెళతారు. అక్కడి వారి అనుభవాల ఆధారంగా ‘క్లైమాక్స్‌’ చిత్రం ఉంటుంది. హారర్, యాక్షన్‌ అంశాలు ఉన్నాయి. ‘ఎంటర్‌ ద గాళ్‌ డ్రాగన్‌’ చిత్రం షూటింగ్‌ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉంది. చైనా షూట్‌ను కంప్లీట్‌ చేశాం. మేం చైనా నుంచి వచ్చిన నాలుగు రోజులకు అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-07-2020
Jul 07, 2020, 03:56 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ...
07-07-2020
Jul 07, 2020, 03:40 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విసిరిన పంజాకు గ్రేటర్‌లో కార్యకలా పాలు సాగిస్తున్న పలు ఐటీ, బీపీఓ కంపెనీలు లక్షలాది మంది...
07-07-2020
Jul 07, 2020, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పాలన వ్యవహారాల్లో భౌతికంగా మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు రాష్ట్ర...
07-07-2020
Jul 07, 2020, 02:47 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో రష్యాను దాటేసి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది....
07-07-2020
Jul 07, 2020, 02:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ 1,800 వరకు కేసులు రికార్డు అవుతున్నాయి. ఈ...
07-07-2020
Jul 07, 2020, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడగా.. మొత్తం...
07-07-2020
Jul 07, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: పీజీ, డిగ్రీలు చేసి చిన్నాచితకా ఉద్యో గాలతో నెట్టుకొస్తున్న లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాల యువతను...
06-07-2020
Jul 06, 2020, 19:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న...
06-07-2020
Jul 06, 2020, 18:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు...
06-07-2020
Jul 06, 2020, 18:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క ఫోన్‌ కాల్‌ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి...
06-07-2020
Jul 06, 2020, 17:44 IST
ఇంపాల్‌: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా...
06-07-2020
Jul 06, 2020, 17:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప‍్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ  దేశీయ ఫార్మా సంస్థ  మైలాన్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ...
06-07-2020
Jul 06, 2020, 16:58 IST
ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు
06-07-2020
Jul 06, 2020, 16:39 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ...
06-07-2020
Jul 06, 2020, 16:18 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల...
06-07-2020
Jul 06, 2020, 15:26 IST
ముంబై: క‌రోనా భూతంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహన క‌ల్పించేందుకు పోలీసులు వారి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆధార‌ప‌డే...
06-07-2020
Jul 06, 2020, 14:33 IST
మీరట్‌ : ‘క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ వ‌స్తుందా నెగిటివ్ వ‌స్తుందా అని భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ దాన్ని లేకుండా చేయ‌గ‌లం.....
06-07-2020
Jul 06, 2020, 14:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ల సంఖ్య లక్ష దాటినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం...
06-07-2020
Jul 06, 2020, 12:49 IST
నెల్లూరు(బారకాసు): ఫొటో, వీడియో ఆల్బమ్‌.. ప్రతిఒక్కరి జీవితంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మధురమైన జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటారు. పుట్టినప్పటి నుంచి...
06-07-2020
Jul 06, 2020, 12:44 IST
పారిస్‌: మహమ్మారి కరోనా బారినపడి కోలుకుంటున్నవారికి ఓ చేదు వార్త. వైరస్‌ను జయించినవారిలో కొందరు అతిముఖ్యమైన వాసన గ్రహించే సామర్థ్యాన్ని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top