కంగ్రాట్స్ హీరో.. థాంక్యూ రకుల్! | Rakulpreet singh wishwes to sandeep Kishan for new movie | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్ హీరో.. థాంక్యూ రకుల్!

May 28 2017 5:14 PM | Updated on Sep 15 2019 12:38 PM

కంగ్రాట్స్ హీరో.. థాంక్యూ రకుల్! - Sakshi

కంగ్రాట్స్ హీరో.. థాంక్యూ రకుల్!

తన లేటెస్ట్ మూవీలో తమన్నా భాటియా, కునాల్ కోహ్లీ లాంటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ తో వర్క్ చేయబోతున్నానని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని యంగ్ హీరో సందీప్ కిషన్ అంటున్నారు.

హైదరాబాద్: తన లేటెస్ట్ మూవీలో తమన్నా భాటియా, కునాల్ కోహ్లీ లాంటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ తో వర్క్ చేయబోతున్నానని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని యంగ్ హీరో సందీప్ కిషన్ అంటున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ లండన్ లో ప్రారంభం కానుంది. తమన్నా, కునాల్ కోహ్లీలతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ హీరో సందీప్ ట్వీట్ చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీలో సందీప్ తో జతకట్టి తొలి సక్సెస్ అందుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.

ఈ మూవీ యూనిట్ తమన్నా, సందీప్, కునాల్ కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు రకుల్. ఆ వెంటనే థ్యాంక్యూ రకుల్ అంటూ హీరో సందీప్ కిషన్ రీట్వీట్ చేశారు. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ హీరోగా ఫనా, సైఫ్ అలీఖాన్ తో హమ్ తుమ్, తేరీ మేరి కహాని సినిమాలను రూపొందించిన కునాల్ కోహ్లి తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా నటిస్తోంది తమన్నా. మూవీ యూనిట్ సహా సందీప్ కిషన్ జూన్ మొదటి వారంలో లండన్ వెళ్లనున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement