కన్నడ పవర్‌స్టార్‌ @ అల్లు శిరీష్‌ సెట్స్‌ | Puneeth Rajkumar visits Allu Sirish's Okka Kshanam sets | Sakshi
Sakshi News home page

కన్నడ పవర్‌స్టార్‌ @ అల్లు శిరీష్‌ సెట్స్‌

Nov 14 2017 1:22 AM | Updated on Nov 14 2017 4:30 AM

Puneeth Rajkumar visits Allu Sirish's Okka Kshanam sets - Sakshi

అల్లు శిరీష్‌ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. సురభి, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లు. శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడికి కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు దర్శకుడు వీఐ ఆనంద్‌ సినిమా గురించి వివరించారట! ‘‘శిరీష్‌ హార్డ్‌ వర్కర్‌. నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉంది. కథ ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనుకుంటున్నా’’ అని పునీత్‌ చిత్రబృందంతో చెప్పారట! ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్‌గారి ఫ్యామిలీకీ, మా ఫ్యామిలీకీ ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇటీవలే శివన్న (శివ రాజ్‌కుమార్‌) ‘తగరు’ టీజర్‌ లాంచ్‌కి నేను వెళ్లా. ఇప్పుడు పునీత్‌ మా సెట్స్‌కి రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, సత్య, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: సతీష్‌ వేగేశ్న, రాజేశ్‌ దండ, సంగీతం: మణిశర్మ, కెమెరా: సుజిత్‌ వాసుదేవ్, మాటలు: అబ్బూరి రవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement