అంత ఉత్సాహం ఎందుకో?

Priyanka Chopra Won't Speak About Nick Jonas In Public - Sakshi

‘‘అదేంటో కానీ ఇరుగు పొరుగు విషయాలు తెలుసుకోకపోతే కొంతమందికి నిద్ర పట్టదు. ఏదీ లేకపోతే కనీసం ఒక కట్టుకథ అయినా అల్లేసి సంతృప్తి పడిపోతారు. ఎందుకో ఈ ఉత్సాహం?’’ అంటున్నారు ప్రియాంకా చోప్రా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌తో సింగపూర్‌లో టైమ్‌ స్పెండ్‌ చేసిన తర్వాత ముంబైలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు ప్రియాంక. అక్కడ నిక్‌తో మీ రిలేషన్‌షిప్‌ ఏంటీ? అన్న ప్రశ్న ప్రియాంకకు ఎదువ్వడంతో.. ‘‘నా జీవితం ఏమైనా పబ్లిక్‌ ప్రాపర్టీనా? మొత్తం అన్నీ చెప్పేయడానికి. అందులో ఓ పది శాతం పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది.

నా కుటుంబం, నా రిలేషన్‌షిప్, ఫ్రెండ్స్‌కి సంబంధించిన కొన్ని విషయాలను నాలోనే దాచుకునే హక్కు నాకు ఉంది. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా  గురించి రూమర్స్‌ వినిపించినప్పుడు కొన్నిసార్లు నవ్వుకుంటాను. కొన్నిసార్లు బాధను దాచుకుంటాను. అంతే కానీ నా వ్యక్తిగత విషయాల గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ఈ రోజు వచ్చే న్యూస్‌  రేపటికి పనికి  రాకపోవచ్చు. అందుకే పనికి రాని న్యూస్‌ల గురించి పట్టించుకోను’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంక. ఈ సంగతి ఇలా ఉంచి సినిమాల విషయానికొస్తే... దాదాపు రెండేళ్ల తర్వాత హిందీలో ప్రియాంకా నటిస్తున్న ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ షూటింగ్‌ బుధవారం మొదలైంది. సోనాలీ బోస్‌ దర్శకుడు.  

అప్‌సెట్‌ కాలేదు: రీసెంట్‌గా సల్మాన్‌ ‘భారత్‌’ సినిమా నుంచి ప్రియాంకా తప్పుకున్న సంగతి తెలిసిందే. మీ సినిమా నుంచి ప్రియాంకా ఎందుకు తప్పుకున్నారు? అని సల్మాన్‌ ఖాన్‌ను అడిగితే.. ‘‘ఆమె ఒక బిగ్‌ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశారని తెలిసింది. అయితే తన వంతు షూటింగ్‌ మొదలయ్యే పది రోజుల ముందే ఈ నిర్ణయాన్ని   చెప్పడం మంచిది అయింది.  ప్రియాంకా నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం’’ అన్నారు సల్మాన్‌ ఖాన్‌. ప్రియాంక తప్పుకున్నందున అందరూ అనుకుంటున్నట్లు సల్మాన్‌ అప్‌సెట్‌ కాలేదని ఆమె తల్లి మధు చోప్రా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top