ఆ పాట వింటే నా వెంటే! | priyanka chopra about tatto on her hand | Sakshi
Sakshi News home page

ఆ పాట వింటే నా వెంటే!

Jan 4 2017 11:39 PM | Updated on Sep 5 2017 12:24 AM

ఆ పాట వింటే నా వెంటే!

ఆ పాట వింటే నా వెంటే!

‘డాడీస్‌ లిల్‌ గర్ల్‌’... ఇది ప్రియాంకా చోప్రా చేతి మీద ఉన్న టాటూ. తండ్రి అంటే ఆమెకు పిచ్చి ప్రేమ.

‘డాడీస్‌ లిల్‌ గర్ల్‌’... ఇది ప్రియాంకా చోప్రా చేతి మీద ఉన్న టాటూ. తండ్రి అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. అందుకే ఇలా పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రియాంక తండ్రి అశోక్‌ చోప్రా చనిపోయారు. భౌతికంగా మాత్రమే ఆయన దూరమయ్యారని ఆమె అంటున్నారు. అప్పట్లో  అశోక్‌ చోప్రా ఓ పాట పాడారు. ఆ పాటను రిలీజ్‌ చేద్దామని  ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లడం జరిగిపోయాయి.

ఇప్పుడా పాటను తాను నిర్మించి న తాజా పంజాబీ చిత్రం ‘శర్వాణ్‌’లో వాడారు ప్రియాంక. ‘‘మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్‌ మోడల్‌. నాన్న పాడిన పాట వింటున్నపుడు ఆయన నాతో ఉన్నారన్న భావన కలుగుతుంది. మా నాన్న మీద ఉన్న ప్రేమతోనే ‘శర్వాణ్‌’ నిర్మించా. ఆయన పాడిన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఆనందంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement