ఆ విద్య ఇప్పుడు పనికొస్తుంది: హీరోయిన్

ఆ విద్య ఇప్పుడు పనికొస్తుంది: హీరోయిన్


'కంచె' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత తెలుగు సినిమాలో మెరిసిందే లేదు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'నక్షత్రం' సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నారామె. పోలీసాఫీసర్ పాత్రలో అలరించనున్న ఆమె దీనిపై మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ఇంత త్వరగా పోలీసాఫీసర్ పాత్రలో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ విషయంలో చాలా ఆత్రుతగా ఉన్నాను. వాటిలో ఒకటి సందీప్తో చేసే ఫైట్. ఐదు సంవత్సరాలపాటు కరాటేలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించాను. నేను నేర్చుకున్న ఆ విద్య ఇప్పుడిలా ఉపయోగపడుతుంది. షూటింగ్ త్వరగా మొదలవ్వాలని కోరుకుంటున్నాను.  కృష్ణవంశీ సార్తో పనిచేయడం కల నిజమవడంలాంటిది' అంటూ తన సంతోషాన్నంతా చెప్పుకొచ్చింది ప్రగ్యా.మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీసాఫీసర్గా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తేజుకి జంటగా ప్రగ్యా కనిపించనున్నారు. కాగా హీరో సందీప్ సరసన రెజీనా హీరోయిన్గా అలరించనున్నారు.  ఇంతమంది స్టార్స్ కనువిందు చేయనున్నారన్న వార్తతో 'నక్షత్రం' సినిమాపై కృష్ణవంశీ అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top