పూలరంగడు కాంబినేషన్‌ లో మరో సినిమా

Poolarangadu Combo On The Cards - Sakshi

కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్‌ తీసుకున్న సునీల్‌ ఒకటి రెండు సినిమా విజయాలు తప్ప హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి కమెడియన్‌ గా టర్న్‌ తీసుకొని రవితేజ, శ్రీనువైట్ల సినిమాతో పూర్తి స్థాయి కమెడియన్‌ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే హీరోగా మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

తనకు పూలరంగడు లాంటి హిట్ సినిమాను అందించిన వీరభద్రం దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సునీల్‌. ఈ సినిమా అంజి రెడ్డి ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top