మందు మానేయడం కష్టమే కానీ.. : హీరోయిన్ | Pooja Bhatt on her alcohol addiction: It is difficult to come back | Sakshi
Sakshi News home page

మందు మానేయడం కష్టమే కానీ.. : హీరోయిన్

Mar 23 2017 7:45 PM | Updated on Aug 17 2018 7:40 PM

మందు మానేయడం కష్టమే కానీ.. : హీరోయిన్ - Sakshi

మందు మానేయడం కష్టమే కానీ.. : హీరోయిన్

మద్యం తాగే అలవాటు మానుకోవడం చాలా కష్టమని, ఎంతో కృతనిశ్చయం అవసరమని బాలీవుడ్ నటి పూజాభట్ అన్నారు.

న్యూఢిల్లీ: మద్యం తాగే అలవాటు మానుకోవడం చాలా కష్టమని, ఎంతో కృతనిశ్చయం అవసరమని బాలీవుడ్ నటి పూజాభట్ అన్నారు. తాగుడు అలవాటు మానేయాలంటే, ముందు దీన్నో సమస్యగా గుర్తించాలని సూచించారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పూజాభట్ మాట్లాడుతూ.. మద్యపానాన్ని ఓ సమస్యగా గుర్తించడం వల్లే తాను విడిచిపెట్టానని చెప్పారు. ఒకప్పుడు తాను మద్యానికి బానిసనయ్యానని, గతేడాది క్రిస్ట్‌మస్‌ రోజు ఈ అలవాటును వదులుకొన్నానని చెప్పారు. మద్యంతాగే అలవాటున్న మహిళలు చాలామంది దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారని, తమకు అలవాటు లేదని బయటకు చెబుతారని అన్నారు. మద్యానికి బానిస కావడమే గాక, ఎప్పుడూ మత్తులోనే ఉండిపోతారని హెచ్చరించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అయిన పూజాభట్ పలు సినిమాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement