పిల్లోడి ప్రేమకథ | Pilladu telug movie Shooting Completed | Sakshi
Sakshi News home page

పిల్లోడి ప్రేమకథ

Nov 22 2013 1:40 AM | Updated on Sep 2 2017 12:50 AM

పిల్లోడి ప్రేమకథ

పిల్లోడి ప్రేమకథ

హరిచరణ్, లీలా రాథోడ్, హిమజ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘పిల్లోడు’. ‘నభూతో నభవిష్యతి’ అనేది ఉపశీర్షిక. రామ్ జి.చెన్నయ్‌సూరి దర్శకుడు.

 హరిచరణ్, లీలా రాథోడ్, హిమజ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘పిల్లోడు’. ‘నభూతో నభవిష్యతి’ అనేది ఉపశీర్షిక. రామ్ జి.చెన్నయ్‌సూరి దర్శకుడు. ఆరవ్ మాసిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం టాకీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక అందమైన ప్రేమకథ. నవ్యమైన కథ, కథనాలతో కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. వైజాగ్, అరకు, కుడియ, కేరళ, హైదరాబాద్ పరిసరాల్లో జరిగిన షూటింగ్‌తో టాకీ పూర్తయింది. ఈ నెలలోనే పాటల చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. శరత్, తడివేలు, ధన్‌రాజ్, వీరస్వామి, అనూజ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్, పాటలు: గోవింద్ జగన్నాథ్, కెమెరా: హరిఫ్.
 

Advertisement

పోల్

Advertisement