అది నా చేతుల్లో లేదు | Parineeti Chopra thanks fans for showering love on Kesari | Sakshi
Sakshi News home page

అది నా చేతుల్లో లేదు

Mar 24 2019 1:10 AM | Updated on Apr 3 2019 6:34 PM

Parineeti Chopra thanks fans for showering love on Kesari - Sakshi

‘‘నా కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటాను. వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాను’’... కెరీర్‌ గురించి మీ వైఖరి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నను హీరోయిన్ల ముందుంచితే సాధారణంగా పై విధంగానే సమాధానాలు చెబుతారు. కానీ బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతీ చోప్రా మాత్రం ‘అది నా చేతుల్లో లేదు’ అంటున్నారు. ‘‘మన అంచనాలు అన్ని వేళలా నిజం కావు. హిట్‌ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్‌ అవొచ్చు. ‘‘ఫ్లాప్‌ అవుతుందనుకున్న సినిమా హిట్‌ కావొచ్చు.

అంతా ఆడియన్స్‌ చేతిలో ఉంటుంది. కెరీర్‌ అయినా అంతే. అది మన చేతిలో ఉండదు. మన సినిమాలు హిట్‌ సాధిస్తే ఆఫర్లు వస్తాయి. లేకపోతే లేదు. అందుకే నేను కెరీర్‌ను పెద్దగా ప్లాన్‌ చేసుకోను. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చిన పాత్రకు ఓకే చెప్పుకుంటూ ముందుకు వెళతాను. కానీ ఒప్పుకున్న సినిమాకు నా వంతు న్యాయం చేయడానికి మాత్రం ఎంత కష్టమైనా వెనకాడను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే సినిమా సైన్‌ చేశారు పరిణీతి. ‘సందీప్‌ ఔర్‌ పింకీ పరార్, జబరియా జోడి’ ఆమె నెక్ట్స్‌ రిలీజ్‌ చిత్రాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement