నిత్యా.. నిజమేనా

Nithya Menen in Rajamouli RRR - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎప్పటికప్పుడు స్టార్స్‌ను యాడ్‌ చేస్తూ ప్రాజెక్ట్‌ను మరింత ఎగై్జటింగ్‌గా మారుస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు లేటెస్ట్‌గా నిత్యా మీనన్‌ కూడా జాయిన్‌ అవనున్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఓ కీలక పాత్ర కోసం నిత్యా మీనన్‌ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం.

ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా నడుస్తున్నాయని చిత్రబృందానికి సంబంధించిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరి నిత్య పాత్ర గెస్ట్‌ రోల్‌లా ఉంటుందా? ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ‘జనతా గ్యారేజ్‌’లో ఎన్టీఆర్, నిత్యా జంటగా నటించారు. మరి మళ్లీ జంటగా కనిపిస్తారా? వేచి చూడాలి. నిజానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌లో లేరు. చరణ్‌కు గాయం కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన చిత్రబృందం త్వరలోనే కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ చేయనున్నారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌ కుమార్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top