నిను వీడను

ninu veedani needanu nene shooting final stage - Sakshi

‘‘మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ, తన నీడతోనే యుద్ధం చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు? ఎలా సక్సెస్‌ అయ్యాడు?’’ అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. సందీప్‌ కిషన్, అన్య సింగ్‌ జంటగా కార్తీక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్‌ మర్చంట్స్‌ పతాకాలపై దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కార్తీక్‌ రాజు మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని డిఫరెంట్‌ పాయింట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిస్తున్నాం. సందీప్‌ కిషన్‌ తొలిసారి నటిస్తోన్న హారర్‌ చిత్రమిది. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం’’అన్నారు. ‘‘సినిమాను అనుకున్న ప్లానింగ్‌ ప్రకారం కార్తీక్‌ పూర్తి చేస్తున్నారు. ఫిబ్రవరిలో మా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని దయా పన్నెం అన్నారు. పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిషోర్, రాహుల్‌ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజ్,  ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివా చెర్రీ, సీతారాం, కిరుబాకరన్, కెమెరా: పమ్రోద్‌ వర్మ, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top