రిపోర్టర్‌ యాక్షన్‌

nikhil mudhra second shedule starts - Sakshi

నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముద్ర’. అవురా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్స్‌పై కావ్య వేణుగోపాల్, రాజ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటరై్టనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే 50శాతం షూటింగ్‌ పూర్తయింది. తాజా షెడ్యూల్‌లో నిఖిల్, లావణ్యా త్రిపాఠిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం.

సినిమాలో కొన్ని సీన్స్‌ వాస్తవానికి దగ్గరగా ఉండటంతో ఒరిజినల్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుపుతున్నాం. ఇందులో నిఖిల్‌ రిపోర్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఓ టీవీ స్టూడియోలో షూటింగ్‌ జరుగుతోంది. నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ముద్ర’ ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్‌ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి కెమెరా: సూర్య, సంగీతం: సామ్‌ సి.ఎస్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top