
హీనాఖాన్, శిల్పా షిండే (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై : బిగ్‌బాస్ 11వ సీజన్ పలు వివాదాలకు కారణమైంది. ముఖ్యంగా బుల్లితెర నటి శిల్పా షిండే, హీనాఖాన్‌ల మధ్య గొడవ రోజురోజుకు ముదురుతోంది. బిగ్‌బాస్ 11వ సీజన్ విజేతగా శిల్పా షిండే నిలవగా, ఆమె ప్రత్యర్థి, ఫైనలిస్ట్ హీనా ఖాన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో వీరి మధ్య వాగ్వివాదం మొదలై సోషల్ మీడియాలో వీరి అభిమానుల మధ్య వివాదంగా మారింది. ఎంతగా ఉంటే.. నగ్న వీడియోలు బయటపెడతానంటూ ఒకరి అభిమాని మరో నటిని బెదిరింపులకు పాల్పడుతూ.. వేధింపుల పర్వం కొనసాగేలా పరిస్థితి తయారైంది.
తాజాగా అదే వివాదం..
ఇటీవల తమ అభిమాన నటి శిల్పాషిండే అశ్లీల వీడియో లీక్ చేస్తామంటూ హీనా ఫ్యాన్స్ బెదిరించడంతో శిల్పా అభిమానులు అలర్ట్ అయ్యారు. అడల్ట్ వెబ్‌సైట్ నుంచి హీనాఖాన్ వీడియో డౌన్‌లోడ్ చేశామని, మంచిపాట జతచేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తామంటూ బెదరింపులకు పాల్పడుతున్నారు. హీనా ఫ్యాన్స్ అంటే ఆమె క్లైయింట్స్ అని తెలుసుకోండి అంటూ శృతి అనే నెటిజన్ పోస్ట్ చేయడం మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
This is bad 😡.. pls don't do this 🙏
— Ashutosh Shinde (@ShindeAshutosh) 24 April 2018
Take this off right away.. pic.twitter.com/GgWxCFNfqi
ఇటీవల శిల్పా షిండే పోర్న్‌క్లిప్ అంటూ హీనా ఖాన్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. దీంతో వీరి మధ్య అంతరం మరింత పెరిగింది. దీనిపై శిల్పా స్పందిస్తూ.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, కొందరు వ్యక్తులు పగతో ఇలాంటివి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రియల్ లైఫ్.. రియాల్టీ షో కాదు..
సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సాధారణంగా జరుగుతుంది. మనపై కామెంట్లు చేస్తే కొన్ని లక్షల మందికి ఆ విషయం తెలుస్తోంది. అందుకు రియల్ లైఫ్.. రియాల్టీ షో కాదని గుర్తుంచుకుని మెలగడం ఉత్తమమని హీనాఖాన్ ట్వీట్ చేశారు.