చిరుకు నో చెప్పి.. ప్రభాస్కు ఓకె..! | Neil Nitin Mukesh in Prabhas Saaho | Sakshi
Sakshi News home page

చిరుకు నో చెప్పి.. ప్రభాస్కు ఓకె..!

Jun 1 2017 1:41 PM | Updated on Sep 5 2017 12:34 PM

చిరుకు నో చెప్పి.. ప్రభాస్కు ఓకె..!

చిరుకు నో చెప్పి.. ప్రభాస్కు ఓకె..!

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాకు రెడీ అవుతున్నాడు.

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాకు రెడీ అవుతున్నాడు. బాహుబలి కోసం నాలుగేళ్ల పాటు కష్టపడ్డ డార్లింగ్ ప్రజెంట్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సాహో సెట్స్ మీదకు వెళ్ళనున్న నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడు పెంచారు. ఇప్పటికే కథా కథనాలు ఫైనల్ కాగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రభాస్కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్స్తో పాటు సౌత్ హీరోయిన్స్ను కూడా పరిశీలిస్తున్నారు.

తాజాగా ఈ భారీ చిత్రానికి ప్రతినాయకుణ్ని ఫైనల్ చేశారు. బాలీవుడ్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నీల్ నితిన్ ముఖేష్ను ఫైనల్ చేశారట. గతంలో తమిళ సినిమా కత్తిలో విలన్గా నటించిన నీల్, తరువాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 కోసం సంప్రదించినా అంగీకరించలేదు. అయితే తాజాగా ప్రభాస్ సాహోలో నటించేందుకు నీల్ అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సాహోకు సంబంధించిన నటీనటులు వివరాలతో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement