మన కథ ముగిసింది: నీతూ కపూర్‌ | Neetu Kapoor Shares Fare well Note To Her Husband Rishi Kapoor | Sakshi
Sakshi News home page

నీతూ కపూర్‌ భావోద్వేగం

May 2 2020 5:01 PM | Updated on May 2 2020 5:39 PM

Neetu Kapoor Shares Fare well Note To Her Husband Rishi Kapoor - Sakshi

బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్ క్యాన్సర్‌తో రేండేళ్లుగా పోరాటం చేసి చివరకు గురువారం ఉదయం మృతి చెందారు. కాగా ఆయన భార్య నితూ కపూర్‌ ఆయనకు వీడ్కోలు చెబుతూ భావోద్వేగ పోస్టును శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మందు గ్లాసు పట్టుకుని.. చిరునవ్వు చిందిస్తున్న రిషీ కపూర్‌ ఫొటోకు ‘మన కథ ముగిసింది’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆమె పోస్టు చూసిన నెటిజన్లు రిషీ కపూర్‌కు సోషల్‌ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. కాగా రిషీ‌, నీతూ కపూర్‌లు కలిసి నటించిన 1974 చిత్రం ‘జరీలా ఇన్సాన్‌’ సెట్స్‌లో వారికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. (చింటూ అంకుల్‌.. మిమ్నల్ని మిస్సవుతున్నా)

End of our story ❤️❤️

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

రిషీ కపూర్‌, నీతూ కపూర్‌లు కలిసి ‘ఖేల్‌ ఖేల్‌ మేన్‌’, ‘రఫో చక్కర్‌’, ‘కబీ కబీ’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’, ‘దునియా మేరీ జబ్‌ మేన్‌’, ‘జిందా దిల్’‌ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక వివాహం ఆనంతరం ‘లవ్‌ ఆజ్‌ కల్’‌, ‘దో ధూనీ చార్‌’, ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ ‘బేషరం’ వంటి సినిమాలు చేశారు.

ఇక బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకోనే రాబోయే రీమేక్‌ ‘అన్నే హాత్‌వే’ చిత్రంతో పాటు పలు సినిమాలకు ఆయన సంతకాలు చేసినట్లు సమాచారం. కాగా ‘నన్ను తలచుకుంటే ముఖంపై చిరునవ్వు రావాలి తప్ప కన్నీరు రావద్దు’ అన్న రిషీ కపూర్‌ చివరి కోరికను వెల్లడిస్తూ కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. రేండేళ్లుగా బ్లడ్‌ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ రిషీ కపూర్..‌ సంవత్సరం పాటు అమెరికాలో క్యాన్సర్‌కు‌ చికిత్స చేయించుకుని తిరిగి గతేడాది సెప్టెంబర్‌లో ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గురువారం(ఏప్రిల్‌ 30)న తుదిశ్వాస విడిచారు. అదే రోజు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..)

‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement