
కొత్త నియమం!
నయనతార లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన మలయాళ హిట్ సినిమా ‘పుదియ నియమం’ను శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్ మోహన్ తెలుగులో ‘వాసుకి’గా అందిస్తున్నారు.
నయనతార లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన మలయాళ హిట్ సినిమా ‘పుదియ నియమం’ను శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్ మోహన్ తెలుగులో ‘వాసుకి’గా అందిస్తున్నారు. ఎస్.కె షాజన్ దర్శకుడు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు రెడీ అయింది. ‘‘పుదియ నియమం అంటే కొత్త నియమం.
ఈ సినిమాలో హీరోయిన్ ఎలాంటి నియమం పెట్టుకుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వేసవికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ఎస్.ఆర్. మోహన్. ఈ చిత్రానికి కెమెరా: వర్గీస్ రాజ్, పాటలు: భువన చంద్ర, వెన్నెలకంటి.