వ్యక్తిగత జీవితాన్ని నయనతార ఈజీగా తీసుకుంటారని కొందరు అంటుంటారు. ఆమెపై వచ్చిన వివాదాలు అది నిజమని చెప్పకనే చెబుతాయి.
వ్యక్తిగత జీవితాన్ని నయనతార ఈజీగా తీసుకుంటారని కొందరు అంటుంటారు. ఆమెపై వచ్చిన వివాదాలు అది నిజమని చెప్పకనే చెబుతాయి. కానీ వృత్తిపర జీవితం విషయంలో మాత్రం నయన చాలా స్ట్రిక్ట్. పాత్ర నచ్చితే... దాని కోసం ఎంతటి స్ట్రగుల్ అయినా.. అనుభవించడానికి సిద్ధంగా ఉంటారామె. ‘శ్రీరామరాజ్యం’లోని సీత పాత్రే అందుకు ఓ ఉదాహరణ. ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కోసమైతే... కష్టపడి తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నయన. అందుకే వివాదాలతో ప్రమేయం లేకుండా ప్రేక్షకా దరణ పొందుతున్నారు తను. ప్రస్తుతం తెలుగులో నయనతార నటిస్తున్న చిత్రం ‘అనామిక’.

