వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా

Nani New Film Titled Tuck Jagadish - Sakshi

ఒక సినిమా పూర్తవుతుందనగానే మరో సినిమాను ప్రకటిస్తాడు హీరో నాని. ఈ ఏడాది గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించాడు.  ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇది చిత్రీకరణలో ఉండగానే నాని తదుపరి సినిమాను ప్రకటించాడు.  నానీతో ‘నిన్ను కోరి (2017), నాగచైతన్య, సమంతతో మజిలీ (2019)’ సినిమాలను తెరకెక్కించి, మంచి జోష్‌ మీద ఉన్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మంగళవారం  ఈ సినిమా టైటిల్‌, ఇతర వివరాలను ప్రకటించారు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ఖరారు చేశారు. 

టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో నాని టక్ చేసుకొని వెనకాల ఉన్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.‘మజిలీ’ నిర్మాతలు  సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. మరో హీరోయిన్‌ గా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top