ప్రేమ పాట పాడిన నాగ్ | Nagarjuna singing 'Kotha Kotha Bhasha' from Nirmala Convent is a treat for fans | Sakshi
Sakshi News home page

ప్రేమ పాట పాడిన నాగ్

Jul 23 2016 11:22 PM | Updated on Jul 21 2019 4:48 PM

ప్రేమ పాట పాడిన నాగ్ - Sakshi

ప్రేమ పాట పాడిన నాగ్

‘కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమభాష...’ అంటూ పన్నెండేళ్ల పిల్లాడు అమీన్ పాడిన పాట అక్కినేని నాగార్జునకు విపరీతంగా నచ్చేసింది.

 ‘కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమభాష...’ అంటూ పన్నెండేళ్ల పిల్లాడు అమీన్ పాడిన పాట అక్కినేని నాగార్జునకు విపరీతంగా నచ్చేసింది. ఈ అమీన్ ఎవరో కాదు.. ఎ.ఆర్. రహమాన్ తనయుడు. ‘నిర్మల కాన్వెంట్’ కోసం అమీన్ పాడిన ఈ ప్రేమ పాటను ఆ చిత్రనిర్మాత నాగార్జున విన్నారు. ప్రేమను వర్ణిస్తూ సాగే ఈ పాటను మళ్లీ మళ్లీ విన్నారు. వినడం మాత్రమే కాదు.. వెంటనే ఈ పాట పాడాలని నిర్ణయించుకున్నారు.
 
  ‘సీతారామరాజు’లో ‘చీపుగా చూడకు పొరపాటు.. చిరాకు పడదా సిగరెట్టు..’ అనే పాట పాడిన నాగర్జున, పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ పాటతో ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. తాజా పాటను శనివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘హృదయానికి హత్తుకునే ఈ అందమైన ప్రేమ పాట ప్రేక్షకులకూ, ఫ్యాన్స్‌కూ నచ్చుతుందని ఆశిస్తున్నా.
 
 నేను చాలా ఇష్టపడి పాడాను’’ అని నాగార్జున పేరొన్నారు. ఈ పాటను ప్రముఖ సంగీతదర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరిచారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రేయా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నాగర్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు చిత్రాన్ని నిర్మించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement