నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్‌...అక్కడా? | Naa Peru Surya Audio Function Will Be Held At Madhavaram | Sakshi
Sakshi News home page

మిలటరీ గ్రామంలో ఆడియో రిలీజ్‌

Apr 14 2018 12:16 PM | Updated on Jul 12 2019 4:40 PM

Naa Peru Surya Audio Function Will Be Held At Madhavaram - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మిలటరీ నేపథ్యం, బన్నీ నటన, భారీ యాక్షన్‌ సీన్స్‌ వీటన్నింటి దృష్ట్యా సినిమా గ్యారంటీగా హిట్‌ అవుతుందని అంటున్నారు బన్నీ అభిమానులు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, డైలాగ్‌ ఇంపాక్ట్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సినిమాలోని మిగతా పాటలను మిలటరీ గ్రామమైన మాధవరం(ప.గో జిల్లా)లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. ఈ ఊళ్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు మిలటరీలో పనిచేస్తారు. ఈ సినిమాలో బన్నీ సోల్జర్‌గా నటిస్తున్నాడు, అందుకే మిలటరీ గ్రామంలో ఆడియో ఫంక్షన్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మే 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది విడుదలకు ముందు ఈ నెల చివర్లో హైద్రాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement